

మనన్యూస్,ఆర్కేపురం:మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ టెలిఫోన్ కాలనీ రోడ్డు నం.1లో గల జ్ఞాన సరస్వతి దేవాలయ స్థాపించి పుష్కరకాలం అయినా సందర్భంగా దేవాలయంలో కాలనీ అసోసియేషన్ దేవాలయ కమిటీ సముక్తంగా నిర్వహించే పుష్కర కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమానికి
మాజీ మంత్రి,మహేశ్వరం శాసన సభ్యురాలు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయ కమిటీ ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్,నియోజకవర్గ బిఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ,డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్,నాయకులు శ్రీనివాస్ రెడ్డి కంచర్ల శేఖర్ కొండ శ్రీనివాస్ సాజీద్ శ్యామ్ గుప్తా నవీన్ గౌడ్ మహిళా అధ్యక్షురాలు ఊర్మిల రెడ్డి,స్వప్న ,అనురాధ,దేవాలయ చైర్మన్ వరప్రసాద్,సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి,ట్రెజరర్ రాములు కాలనీ అసోసియేషన్ సభ్యులు సంజీవరెడ్డి,అరవింద్ కుమార్,లక్ష్మయ్య, రమణ,మహిళా సభ్యురాలు వాసవి,కరుణ,సృజన తదితరులు పాల్గొన్నారు.