

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేట జీడిపిక్కల కార్మికుల పోరాటం ఆదివారానికి 59వ రోజుకు చేరుకుంది. ఈ శిబిరానికి సిఐటియు జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు దువ్వా శేషుబాబ్జి,చెక్కల రాజ్ కుమారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు సుమారుగా రెండు నెలల పాటు పోరాడుతున్న ప్రభుత్వంలో, యాజమాన్యంలో ఎటువంటి స్పందన లేదని వారన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని వారికి అండగా సిఐటియు ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు. పండుగ నాలుగు రోజులు జరుగుతున్న సందర్భంగా ఈ పోరాటాన్ని 18వ తేదీ వరకు వాయిదా వేయడం జరిగిందని అన్నారు.యాజమాన్యం స్పందించకుంటే ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఒకపక్క కార్మికులు రోడ్డు మీద పడుతున్న ఈ రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలకు కార్మికుల ఆవేదన అర్థం కాకపోవడం అన్యాయమని అన్నారు. ఒకపక్క కొత్త పరిశ్రమలంటూ ఉన్న పరిశ్రమలు మూసేస్తే అన్యాయం అని ప్రశ్నిస్తే సమాధానం లేదని అన్నారు. కార్మికులకు న్యాయం చేయమని అడిగిన వారిపై అక్రమ కేసులు పెట్టి బెదిరించడం సరికాదని అన్నారు .బెదిరింపులు ,కేసులతో ఉద్యమాలను ఆపలేరని ఈ సందర్భంగా అన్నారు. కార్మికులకు న్యాయం చేసే వరకు ఈ పోరాటం విరమించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యుడు రొంగల ఈశ్వరరావు, కార్మికులు లోవరాజు, వీరబాబు, ధర్మజీ,రామదుర్గ, ఒ దుర్గప్రసాద్,భాగ్యలక్ష్మి, పాపారత్నం తదితరులు పాల్గొన్నారు.