మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- జోరుగా మూడో విడత సర్పంచ్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా గ్రామాల్లో బిజెపి పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య పాల్గోన్నారు. ఎలక్షన్ ప్రచారంలో పాల్గొని, గ్రామాల్లో. ఓటర్స్ మహశ్రయిలతో మాట్లాడారూ. పార్టీ బలపరిచిన అభ్యర్థులు కాట్రపల్లి గ్రామం కురువ గంట బాలరాజు, సామాన్ పల్లి గ్రామం రాజేశ్వరి,జక్లేర్ గ్రామం శివాని రెడ్డి,కాచువార్ .గ్రామం బుర్కపల్లి మోహన్ గౌడ్ సతీమణి వెంకటమ్మ లను ఓటు వేసి , భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర నాయకుడు బి కొండయ్య ఓటర్లను కోరారు. బిజెపి పార్టీలో గెలిచిన సర్పంచులు కేంద్రం నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మక్తల్ సీనియర్ నాయకులు పావని మల్లికార్జున్, జిల్లా నాయకుడు కల్లూరి నాగప్ప, బ్యాటరీ రాజు తదితరులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *