యాదమరి, మన ధ్యాస నవంబర్ 25 : రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు నవంబర్ 26వ తేదీన ప్రతి విద్యాసంస్థలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించినట్లు కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్ ఎ.పి. లలిత తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో వివిధ ప్రతిభా పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్టు ఆమె ప్రకటించారు. ప్రత్యేక కార్యక్రమంగా విద్యార్థుల కోసం క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, డ్రాయింగ్ పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో సాంఘిక చైతన్యం, రాజ్యాంగ విలువల పట్ల అవగాహన పెంపొందించటం లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా పి.ఆర్.టి.యు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కె. కనకాచారి మాట్లాడుతూ, “రాజ్యాంగ దినోత్సవం ద్వారా విద్యార్థులు భారత రాజ్యాంగం రూపకల్పన, దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య వ్యవస్థ వంటి అంశాలపై అవగాహన పొందుతారు” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి భాస్కర్ రెడ్డి, కనకాచారి, మధుసూదన్, మదన్ మోహన్, సుల్తాన్, దామోదర్ రెడ్డి, చిన్న దొరై, మహేష్ తదితరులు పాల్గొన్నారు.