ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం- ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అడుగులు..!
ఉదయగిరి, అక్టోబర్ 13 :(మన ధ్యాస న్యూస్ ):
ఉదయగిరి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలకు నూతన దిశ చూపిస్తున్న నాయకుడు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు. పదవిలోకి వచ్చిన కేవలం 16 నెలల వ్యవధిలోనే ఆయన ఆధ్వర్యంలో దాదాపు ₹200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు విజయవంతంగా ప్రారంభమయ్యాయి.రోడ్ల నిర్మాణం మరియు మౌలిక సదుపాయాలు
నియోజకవర్గంలోని అన్ని మండలాలకు అనుసంధానంగా లింక్ రోడ్లు ఏర్పాటు చేయడంలో గణనీయమైన పురోగతి సాధించారు. సుమారు ₹100 కోట్ల రూపాయలతో రహదారి అభివృద్ధి పనులు ప్రారంభమై, గ్రామీణ ప్రాంతాల రవాణా సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి.ఆరోగ్య రంగ అభివృద్ధి,ఉదయగిరిలోని సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి ₹5.50 కోట్ల నిధులు రాబట్టడం ద్వారా ఆరోగ్య సేవల విస్తరణకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల స్థానిక రోగులకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.మౌలిక వసతులు మరియు పట్టణ అభివృద్ధి
వింజమూరులో ₹1.75 కోట్లతో డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ త్వరలో ప్రారంభం కానుంది, దీనివల్ల పేద మరియు మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం లభిస్తుంది.20 గ్రామాల్లో విద్యుత్ సౌకర్యాల విస్తరణ చేపట్టడం జరిగినది. అలాగే 60 గ్రామాల్లో త్రాగునీటి కోసం ₹5 కోట్ల వ్యయంతో ఆర్.ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి.
విద్యా రంగం పట్ల ప్రాధాన్యం
విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలసి, నియోజకవర్గంలోని 20 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ₹3 కోట్ల నిధులు రాబట్టారు. ఈ నిధులతో మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యాలు, గదుల నిర్మాణం వంటి పనులు జరుగుతున్నాయి.
ఇంకా గండిపాలెం పాఠశాల అభివృద్ధికి ₹1.75 కోట్లు, అలాగే ఉదయగిరి డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి ₹5 కోట్లు కేటాయించబడినాయి. సీతారామపురం దుత్తలూరు కలిగిరి కొండాపురం మండలాలలో గల కస్తూరిబా విద్యాలయాలకు నూతన భవనాల నిర్మాణం కొరకు సుమారు 6 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగినది.
పరిశ్రమలు మరియు ఉపాధి అవకాశాలు
కలిగిరి మండలంలో 250 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఈ పార్క్ ద్వారా స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు
మొత్తం 143 పంచాయతీల్లో ₹55 కోట్ల నిధులతో 845 సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అదనంగా, కావలి–కొమ్మి–కొండాపురం రోడ్ల అభివృద్ధికి ₹3.25 కోట్లు రాబట్టారు. విద్యుత్ శాఖకు చెందిన ఏఈ కార్యాలయ నిర్మాణానికి ₹2 కోట్లు కేటాయించబడ్డాయి.
సామాజిక సేవా కార్యక్రమాలు
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా, కాకర్ల ట్రస్ట్ ద్వారా కూడా ఆపదలో ఉన్న వారికి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు, దాదాపు 900 మంది నిరుపేద ఆడబిడ్డలకు పెళ్ళికానుకగా 10 వేల రూపాయలను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతర సహాయం అందిస్తున్నారు.
వింజమూరు పట్టణాభివృద్ధి
నుడా (NUDA) నిధులతో వింజమూరు పట్టణంలో సెంటర్ లైటింగ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ చర్యలతో పట్టణం మరింత ఆకర్షణీయంగా, సురక్షితంగా మారనుంది.
మొత్తం మీద, కేవలం 16 నెలల వ్యవధిలోనే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండగా, ఈ విజయాల వెనుక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న సేవాభావం ప్రధాన శక్తిగా నిలిచింది.








