తవణంపల్లి: మన ధ్యాస సెప్టెంబర్-23 తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జొన్నగురకల సచివాలయ పరిధిలోని జోన్నగురకల గ్రామంలో “స్వస్త్ నారి – సశక్త్ పరివార్ అభియాన్” ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు విభిన్న రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, తల్లి-బిడ్డ సేవలు, వయోవృద్ధుల ఆరోగ్య పరీక్షలు, కిషోర బాలిక ఆరోగ్య పరీక్షలు, క్షయ వ్యాధి స్క్రీనింగ్, సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్, ఆయుష్ సేవలు, టీకాల కార్యక్రమం, మానసిక వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మోహనవేలు, డాక్టర్ ప్రియాంక, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జ్ఞానశేఖర్, పి.హెచ్.ఎన్., ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య కార్యకర్తలు, ఎం.ఎల్.హెచ్.పీలు, ఏ.ఎన్.ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ –
“మహిళల ఆరోగ్యం బలపడితేనే కుటుంబం ఆరోగ్యవంతం అవుతుంది. గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలు, వృద్ధుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ప్రజలు ఇలాంటి ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.











