

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ జడ్పీ హైస్కూల్ విద్యార్థులు జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు.మంగళవారం ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి.హెచ్. పద్మజ ప్రకటించారు. విశాఖపట్నంలో జరిగిన 3వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ టార్గెట్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో ప్రకాశం జిల్లా తరపున పోటీ పడి అద్భుత ప్రతిభ కనబరిచిన ఎం. దిలీప్, డి. అక్షర, ఎ. వర్షిణి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు.ఈ ముగ్గురు విద్యార్థులు వచ్చే అక్టోబర్ నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయ సిబ్బంది, ముఖ్యంగా వ్యాయామ ఉపాధ్యాయులు పి. శ్రీనివాసరావు, ఎం.డి. అన్వర్‌లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.