ఇందిరా మహిళా శక్తి చేపల విక్రయ వాహనం పంపిణీ..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి చేపల విక్రయ వాహనాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ వాహనం ద్వారా ముఖ్యంగా మహిళా ఉత్పత్తిదారులు తమ చేపలను నేరుగా మార్కెట్‌కి తీసుకెళ్ళి విక్రయించి,స్వయం ఉపాధిని పొందుతారు. ప్రభుత్వ సబ్సిడీ ద్వారా అందించబడిన ఈ వాహనం మహిళా స్వయం సహాయ సమితులకు అందజేయడం ద్వారా వారి సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.ప్రభుత్వం చేపల పెంపకందారుల సంక్షేమానికి, మార్కెటింగ్ సౌకర్యాల పెంపుకై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మండలాల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ రవీందర్ రెడ్డిలకు అజరుద్దీన్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజా పండరీ,ఖాళీక్,అనిస్,లోక్య నాయక్,నాగభూషణం గౌడ్, ఆకాష్,రాము,సిద్దు,తదితరులు ఉన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..