మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి చేపల విక్రయ వాహనాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ వాహనం ద్వారా ముఖ్యంగా మహిళా ఉత్పత్తిదారులు తమ చేపలను నేరుగా మార్కెట్‌కి తీసుకెళ్ళి విక్రయించి,స్వయం ఉపాధిని పొందుతారు. ప్రభుత్వ సబ్సిడీ ద్వారా అందించబడిన ఈ వాహనం మహిళా స్వయం సహాయ సమితులకు అందజేయడం ద్వారా వారి సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.ప్రభుత్వం చేపల పెంపకందారుల సంక్షేమానికి, మార్కెటింగ్ సౌకర్యాల పెంపుకై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మండలాల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ రవీందర్ రెడ్డిలకు అజరుద్దీన్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజా పండరీ,ఖాళీక్,అనిస్,లోక్య నాయక్,నాగభూషణం గౌడ్, ఆకాష్,రాము,సిద్దు,తదితరులు ఉన్నారు.