

వింజమూరు, మన ధ్యాస న్యూస్ ప్రతినిధి ఆగస్టు 31 :– వింజమూరు పట్టణంలోని పాతూరు నందు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం పక్కన గణేష్ ని మండపంలో కొలువుదీరిన శ్రీ అధినాయకుడు అన్నదానంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు. భక్తులకు అన్నం కూరలను వడ్డించారు. అంతకుముందు అభయాంజనేయ స్వామి వారికి ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సీనియర్ నాయకులు మంచాల శ్రీనివాసులు నాయుడు, కోడూరు నాగిరెడ్డి, డాక్టర్ మాశిలామణి, పివి నాయుడు, బిజ్జం వెంకటకృష్ణారెడ్డి,ఏగినేని శ్రీనివాసులు నాయుడు, పాములపాటి మాల్యాద్రి, రామ్మోహన్, రమణయ్య, రవి గణేష్ మండపం నిర్వాహకులు భక్తులు తదితరులు ఉన్నారు.