ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో దేవాలయాలు అభివృద్ధి……….. వేమిరెడ్డి దంపతులు

మన న్యూస్,ఆత్మకూరు:- ఆత్మకూరులో అలఘనాథస్వామివారి కుంభాభిషేకంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు- స్వామివారి ఆశీసులతో ప్రజలు సంతోషంగా ఉండాలిరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పాలనలో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు అన్నారు. గురువారం ఆత్మకూరు పట్టణంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలఘనాథ స్వామివారి మహా కుంభాభిషేకంలో వారు పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు, సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆలయ శిఖరానికి అభిషేకం చేసి… అలఘనాథస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణ మండపంలో జరిగిన శ్రీదేవి భూదేవి సమేత అలఘనాథ స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ…… దాదాపు 800 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ అలఘనాథ స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. స్వామివారి పునఃప్రతిష్ట చేసి 12 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆలయాల పవిత్రత, హిందూ ధర్మ రక్షణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తూ.. పాలన సాగిస్తున్నారని వివరించారు. దేవాదాయ శాఖ ఆథ్వర్యంలో ఆలయాల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారని, ఇప్పటికే తల్లికివందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అటు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే.. రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్న సీఎం చంద్రబాబు కి స్వామివారి ఆశీసులు అందాలని ఆయన ఆకాంక్షించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ… ఎంతో ఘన చరిత్ర ఉన్న అలఘనాథస్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆనం రామనారాయణరెడ్డి సహకారంతో ఆలయం అభివృద్ధి చెందిందని వివరించారు. అలఘనాథ స్వామివారి ఆశీసులతో జిల్లాతో పాటు ఆత్మకూరు ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాటంరెడ్డి రవీంద్రారెడ్డి దంపతులు, టిడిపి నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, బిజెపి నాయకులు కుడుముల సుధాకర్‌, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ