

సత్య సాయి జిల్లా మన న్యూస్: కదిరి పట్టణంలో బాయ్స్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్భంగానాయకులు అరుణ్, గాలివీడు ఉపేంద్ర మాట్లాడుతూ బాయ్స్ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఇబ్బంది పెడుతూ తాను చెప్పినట్టే వినాలంటూ విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రమౌళి ప్రవర్తన హిట్లర్ మించిపోయిందని ధ్వజ మెత్తారు. అతని మాటలు వినలేదని గురువారం రోజు 5 మంది విద్యార్థులకు టీసీ లు ఇవ్వడం జరిగింది.ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకుcec . దివాకర్.HEC వెంకటేష్,భరత్ మరి ఇద్దరికీ TC లు ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులు వచ్చి బ్రతిమలాడుకున్న పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టి పంపించడం జరిగింది ఒక విద్యార్థిని కళాశాల నుంచి పంపించాలంటే రెండు మూడు సార్లు నోటీసులు ఇవ్వాలి డిసిప్లేన్ కమిటీ నోటీసులు ఇచ్చి అప్పటికి విద్యార్థులలో ప్రవర్తనలో మార్పు రాకుంటే TC ఇవ్వాలి అలా కాకుండా ఒక హిట్లర్ మాదిరి నియంత తత్వంతో వ్యవహరిస్తూ విద్యార్థులకు TCలు ఇవ్వడం జరిగింది విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా మారాడు కనుక తక్షణం చంద్రమౌళి ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని యన్ యస్ యూ ఐ డిమాండ్ చేశారు.