

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలంలోని శానంపూడి మరియు మూలగుంటపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంట కాలంలో సాగు చేసిన ప్రతి రైతు పంట నమోదు స్థానిక గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా చేయించుకోవలసినదిగా, పంట నమోదు ఆధారంగానే ప్రభుత్వం వారు అందించే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్, సబ్సిడీ కింద వ్యవసాయ యంత్ర పరికరాలు, విత్తనాల పంపిణీ వంటి వివిధ పథకాలకు అర్హత లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ నాయకులు పి. బసవయ్య ఏ. శ్రీను, యస్.మల్లికార్జున, ఎన్ సుధాకర్ రావు, రైతు సంఘ ఉపాధ్యక్షులు ఏ.సుధాకర్ వ్యవసాయ విస్తరణ అధికారి షేక్ జహీర్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వెంకటనారాయణ. గ్రామ వ్యవసాయ సహాయకులు శారద మరియు గ్రామ రైతు సోదరులు పాల్గొన్నారు.
