

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం,పట్టణంలో శ్రీ స్వామి దయానంద సరస్వతీ సేవ ఆశ్రమానికి మద్దుల స్వరూప్ మంగళవారం ఆర్థిక చేయుతన్నదించారు.స్థానిక హెల్పింగ్ యూత్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో మద్దుల స్వరూప్ కుమారుడు రుత్విక్ మొదటి పుట్టినరోజు సందర్భంగా అందించిన ఆర్థిక సహాయంతో హెల్పింగ్ యూత్ సభ్యులు సీలింగ్ ఫ్యాన్,కుక్కర్,10 చాపలు పలు విద్యార్థులకు అవసరమయ్యే వస్తువులను ఉచితంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో వంకాయల వెంకటశెట్టి,దంగేటి మురళీకృష్ణ, హెల్పింగ్ యూత్ సభ్యులు,రాంలాల్,ఎస్.కె అలీషా, ఎదుర్ల అప్పాజీ,ఎస్ కే అలీ, తదితరులు పాల్గొన్నారు.