

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-15
సంక్షేమం, ప్రగతి ప్రజలకు అందించాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. మంగళవారం బంగారుపాలెం మండలం, కాటప్పగారిపల్లె, బోడబండ్ల, 170 గొల్లపల్లె, తుంభాయనపల్లె, సెట్టేరి, నల్లంగాడు పంచాయతీల పరిధిలోని గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* పాల్గొన్నారు అంతకుముందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే మురళీమోహన్ కి బంగారుపాళ్యం మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సుపరిపాలలో తోలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం గ్రామంలో ప్రజలతో సమావేశమైన ఆయన స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తే… మరికొన్నిటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా పింఛన్, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అంటూ ప్రజలను తీశారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, వైసీపి ప్రభుత్వం పాలనకు, కూటమి ప్రభుత్వం పాలనకు ప్రజలకు వ్యతాసం చెబుతూ..”ఇది ఓ మంచి ప్రభుత్వం అంటూ ఆశీస్సులు అందిస్తూ, ఆప్యాయంగా పలకరించి కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పక్షపాతం చూపకుండా సాగుతున్న పాలనపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, పూతలపట్టు నియోజకవర్గం పరిశీలకులు బొమ్మన శ్రీధర్, గంధరనెల్లూరు నియోజకవర్గం పరిశీలకులు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు, బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు, బంగారుపాళ్యం మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎన్.పి.జయచంద్ర నాయుడు, చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోక ప్రకాష్ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి జనార్థన్ మరియు మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.


