

కలిగిరి,,మనన్యూస్::మండల కేంద్రమైన కలిగిరి లో తునికల కొలతల అధికారులు మంగళవారం దాడులు చేసి ఏడు షాపుల నుండి 24 వేల రూపాయలు అపరాధ రుసుము కట్టించారు. కావలి తూనీకల కొలతల అధికారుల అధికారులు లీగల్ మెటరాలజీ అధికారి షేక్ మోహిన్ తెలిపిన వివరాల మేరకు కలిగిరి లో మొత్తం 7 షాపులను తనిఖీలు చేయడం జరిగిందన్నారు. ఇందులో బియ్యం బస్తాలు లేబుల్ ఒక విధంగా, తూకం మరొక విధంగా ఉండడం గమనించడం జరిగిందన్నారు. మరికొన్ని షాపులు కూడా తనిఖీలు నిర్వహించి 7 షాపులపై కేసులు రాసి రూ 24 వేల రూపాయలు అపరాధ రుసుం ఆన్లైన్ ద్వారా కట్టించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తూనీకల కొలతల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.