

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ తనయుడు స్వర్గీయ అమృత గౌడ్ జయంతి వేడుకలు విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం స్థానిక ఆనంద నిలయం ఆవరణంలో అభివృద్ధి ఆమృత్ గౌడ్ చిత్రపటానికి పూల మాల వేసి వారి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరము విద్యార్థుల మధ్య కేక్ కటింగ్ చేసి 100 మంది విద్యార్థులకు ప్యాడ్స్ కంపాక్స్ బాక్స్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చిన్న హనుమంతు, నాయకులు జుట్ల శంకరు, చందాపురం అశోక్ కుమార్ గౌడ్, బండారి ఆనంద్, కె ఆంజనేయులు,ఎల్లిగండ్ల బాలప్ప,మల్లేష్, బండారు రవి, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ మణికంఠ గౌడ్, నంద నిలయం హాస్టల్ సోషల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ బాబు కింగ్స్ యూత్ సభ్యులు సాయి సమీర్, కావలి తరుణ్, అక్షయ్ దామోదర్ రాహుల్ పండు అప్పి, నవీన్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.