


మనన్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. మద్దెలచెరువు, పిట్లం రోడ్, తిమ్మ నగర్ వద్ద 4.86 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్‌ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్,సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,వైస్ చైర్మన్ మా రెడ్డి కృష్ణారెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలే. మల్లికార్జున్, హనుమాన్లు,రవీందర్ రెడ్డి, వకీల్ రాంరెడ్డి,ఇతర ప్రజా ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.సోమవారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి పలువురు ఘన స్వాగతం పలికారు.స్వాగతం పలికిన వారిలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్,సబ్ కలెక్టర్ కిరణ్మయి,జాయింట్ కలెక్టర్ విక్టర్‌తో స్వాగతం పలికి మొక్కను మంత్రికి అందజేశారు. మంత్రికి నాయకులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు

