కార్మిక హక్కులు కోసమే సమ్మె

మన న్యూస్ పాచిపెంట, జూన్ 27:- కార్మిక హక్కుల కోసం మనమంతా పోరాడి హక్కులు సాధించుకోవాలని ఎన్ వై నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులు నాశనం చేసే విధంగా నిర్ణయాలు చేస్తుందని,అలాంటి నిర్ణయాలపై కార్మిక వర్గం ఐక్యంగా జూలై 9న సమ్మెకు వెళుతుందని సిఐటియు తెలిపింది.జూలై 9 సమ్మె కు కార్మిక వర్గాన్ని సిద్ధం చేస్తూ జిల్లాలోని జీపు యాత్ర ప్రతినిధులు పాచిపెంటకు చేరుకున్నారు.పనుకువలస మరియు పాచిపెంటలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి జ్యోతిలక్ష్మి ప్రసంగించారు. అలాగే సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణారావు మన్మధ మాట్లాడారు.
దేశంలో కార్మిక వర్గం హక్కులు కాపాడుకునేందుకు పెద్దఎత్తున అన్ని సంఘాల్లో ఉండే కార్మిక వర్గం జూలై 9న సమ్మెలో పాల్గొంటుందని పార్లమెంట్లో పార్లమెంటు బయట బిజెపి ప్రభుత్వాలు మరియు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాయడమే పనిగా పెట్టుకుందని అందులో భాగంగానే పని గంటలు పెంచాలని చూస్తుందని స్కీమ్ వర్కర్లకు వేతనాలు ఇవ్వాలని అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా నాయకులు ఇంద్ర ఎన్ వై నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు పెంచకుండా ఉన్న పథకాలు తీసివేసే కార్యక్రమం చేస్తుందని అందులో భాగంగానే సంక్షేమ పథకాలు కుదించిందని చిరుద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులు జీతాలు పెంచకుండా వెట్టిచాకి చేయిస్తుందని విమర్శించారు కార్మిక వర్గంతో ఏకమై జూలై 9న సమ్మెకు సిద్ధపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రాము, పాచిపెంట మండల నాయకులు పార్వతి బంగారమ్మ రవణమ్మ పెద్ద ఎత్తున స్కీం వర్కర్లు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..