మన న్యూస్,తిరుప‌తిః ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల‌ను తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ముగ్గురు ల‌బ్దిదారుల‌కు చెక్కుల‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. 48వ డివిజ‌న్ రాజీవ్ గాంధీ కాల‌నీకి చెందిన ఎఆర్ అయ్య‌ప్ప కు ఎన‌భై తొమ్మిది వేల ఆరువంద‌ల ప‌ది రూపాయ‌ల చెక్కును ఎమ్మెల్యే త‌న కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఉద‌యం అందించారు. అలాగే 2వ డివిజ‌న్ లోని ఆటోన‌గ‌ర్ కు చెందిన సోమ‌లరాజు. రూప కు డెబ్బ‌య్ తొమ్మిది వేల నూట ప‌న్నెండు రూపాయ‌ల చెక్కును ఎమ్మెల్యే ఆమెకు అందించారు. కాగా ఆంధ్రాబ్యాంక్ కాల‌నీకి చెందిన డి.కృష్ణ కిషోర్ కు మూడు ల‌క్ష‌లా ఐదువేలా డెబ్బై రెండు రూపాయ‌ల చెక్క్ ను ఎమ్మెల్యే ఆయ‌న‌కు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో డిసిసిబి ఛైర్మ‌న్ అమాస రాజ‌శేఖ‌ర్ రెడ్డి, గోల్డ్ బాబు, పురుషోత్తం, సురేష్, బాబ్జీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *