మన న్యూస్,తిరుప‌తిః– ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల‌ను న‌లుగురు ల‌బ్దిదారుల‌కు సోమ‌వారం సాయంత్రం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు త‌న కార్యాల‌యంలో అందించారు. 11వ డివిజ‌న్ కు చెందిన రాధాకృష్ణ రాజు స‌తీమ‌ణి వ‌సంత అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రాధాకృష్ణ రాజుకు రెండు ల‌క్ష‌లా డెబ్బ‌య్ నాలుగు వేల రెండు వంద‌లా అర‌వై ఐదు రూపాయ‌లు మంజూరు కాగా ఆ చెక్క్ ను ఎమ్మెల్యే ఆయ‌న‌కు అందించారు. అలాగే 44 వ డివిజ‌న్ కు చెందిన ల‌క్ష్మీదేవికి ల‌క్షా తొంభై మూడు వేల ఆరు వంద‌ల న‌ల‌భై తొమ్మిది రూపాయ‌ల చెక్ ను ఎమ్మెల్యే అందించారు ఈమె భ‌ర్త సుబ్ర‌మ‌ణ్యం శెట్టి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా 36వ డివిజ‌న్ ఎస్ డి రోడ్డ్ కు చెందిన ఆర్. భానుప్ర‌కాష్ కు ల‌క్షా న‌ల‌భై మూడు వేల మూడు వంద‌ల ముప్పయ్ ఎనిమిది రూపాయ‌ల చెక్ ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ఇచ్చారు. అలాగే 8వ డివిజ‌న్ కు చెందిన వై. ముర‌ళీకి ల‌క్షా ఇర‌వై ఎనిమిది వేలా నాలుగ‌వంద‌లా తొంభై మూడు రూపాయ‌ల చెక్ ను అందుకున్నారు. ఇంటి పెద్ద అనారోగ్యం పాలై తే కుటుంబ‌మంతా ఇబ్బంది ప‌డుతుంద‌ని ఆ ఇబ్బందిని కొంతైనా త‌గ్గించ‌డానికి పెద్ద‌కొడుకుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సిఎంఆర్ ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నార‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్డీఏ కూట‌మి నాయ‌కులు రాజా రెడ్డి, నైనార్ మ‌హేష్ యాద‌వ్, ఆర్కాట్ కృష్ణ‌ప్ర‌సాద్, వెంక‌టేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *