కులం పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించడం నేరం:అంబేద్కర్ సాక్షిగా అన్యాయం జరిగింది , ప్రభుత్వ విప్, కూటమి ఎమ్మెల్యే థామస్ దృష్టికి తీసుకెళ్తాం : జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న.

గంగాధర్ నెల్లూరు, మన న్యూస్ : నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆఫీస్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిరంజీవి ఆధ్వర్యంలో పత్రికా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, మరియు జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ మండలంలో గత పది సంవత్సరాలుగా ఎగువ కమ్మ కండ్రిక ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న వెంకటేశులు ను అకారణంగా , అన్యాయంగా తొలగించడాన్ని జనసేన తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొని దామోదరం నాయుడు, వెంకటేశులు నాయుడు, సోమశేఖర్ నాయుడు, మురళి నాయుడు అనువారు ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేయడానికి వీలు లేదని, అనేకమార్లు గొడవలు పడటం, అతని ఇబ్బంది పెట్టడం, అనేక సందర్భాల్లో చేశారని తెలిపారు. ఇక్కడ ఉంటే తెలుగుదేశం అయినా ఉండాలి, లేదా జనసేన అయినా ఉండాలని అతని విధులు అనేకమార్లు ఆటంకం కలిగించారని, దురుద్దేశపూర్వకంగా జిల్లా కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం అందించారని ఈ సందర్భంగా తెలిపారు. అంబేద్కర్ సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేషులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా కులం, మతం, ప్రాంతం, భాషల ప్రాతిపదికన విభజించి చూడటాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ కు జరిగిన అన్యాయాన్ని గౌరవ ప్రభుత్వ విప్ మరియు కూటమి ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, పాలసముద్రం మండల అధ్యక్షుడు లతీష్, ఎస్ఆర్ పురం మండలం ఉపాధ్యక్షులు చార్లెస్, చందు, ప్రధాన కార్యదర్శి సురేష్, పుల్లూరు సర్పంచ్ పవన్, కార్వేటి నగర్ మండల ప్రధాన కార్యదర్శి ప్రతాప్, మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, నియోజకవర్గ యువజన సంయుక్త కార్యదర్శి అన్నామలై, నియోజకవర్గం బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, యువజన నాయకులు చందు, జన సైనికులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..