ఆటోలకు డిజిటల్ నెంబర్ల పంపిణీ…ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి-ఎస్పీ హర్షవర్ధన్ రాజు…

మన న్యూస్,తిరుపతి :– తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు భరోసా కల్పించడానీకే ఆటోలకు ఈ డిజిటల్ నెంబర్లను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. సోమవారం రిజర్వ్ పోలీస్ గ్రౌండ్ లో ట్రాఫిక్ డిఎస్పి రామకృష్ణమాచారి ఆధ్వర్యంలో నగరంలోని ఆటోలకు డిజిటల్ నెంబర్ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే ప్రయాణికులు ఆటోలలో ఎక్కిన సమయంలో వారిని సురక్షితంగా గమనించేందుకు ఈ డిజిటల్ నెంబర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రయాణికులు ఆటోలో ప్రయాణించేటప్పుడు ఆటోకు సంబంధించిన డ్రైవరుతో పాటు ఆటో పూర్తి వివరాలను క్యూఆర్ కోడ్ తో ఉంటుందన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా క్యూఆర్ కోడ్ను స్కాన్ ఫోటో తీసుకున్న యెడల ఆటో డ్రైవర్ ఓనర్ల యొక్క పూర్తి వివరాలు అందులో తెలుసుకోవడం జరుగుతుందన్నారు. క్యూఆర్ కోడ్ గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ ద్వారా పనిచేస్తుందని ఎస్పీ చెప్పారు. ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు ఒక చోట నుండి మరొక చోటికి వెళ్లే సమయంలో లొకేషన్ అత్యవసర సమయాన్ని మాత్రమే ట్రాక్ లొకేషన్ తెలుసుకోవడం జరుగుతుందన్నారు. వెంటనే ఆ సమాచారం పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయడం జరిగిందన్నారు. ఆటోలో ప్రయాణించేటప్పుడు డ్రైవర్ యొక్క ప్రవర్తన, మీ అభిప్రాయాలను రేటింగ్ ద్వారా తెలియజేయవచ్చునని చెప్పారు. ఆటోలో ప్రయాణించినప్పుడు ఎవరైనా డ్రైవర్లు ఇబ్బంది పెట్టిన అశోక్ కలిగించిన వెంటనే కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు. ఆటో ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ డిజిటల్ నెంబర్లను తీసుకోవాలంటే ఆటో ఓనర్ డ్రైవర్లు తమ వాహనం యొక్క పూర్తి వివరాలతో పాటు ఆధార్ కార్డులను డ్రైవింగ్ లైసెన్స్ ను పాస్పోర్ట్లతో ట్రాఫిక్ పోలీసులకు అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. కావున నగరంలోని ఆటో యమానులు డ్రైవర్లు తమకు సహకరించి నేరాల నియంత్రణకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రవి మనోహరాచారి, నాగభూషణరావు డి ఎస్ పి లు భక్తవత్సలం, శ్యామసుందర్, చంద్రశేఖర్, ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్, సుబ్బారెడ్డి, రమణ, ఆ రైలు రమణారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!