పాలసముద్రం, మండలం న్యూస్ :ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఖతర్,దోహాలో శనివారం రక్తదానం చేసిన పాలసముద్రం మండలం,వనదుర్గాపురం పంచాయతీ కి చెందిన ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్ రక్తదానం చేసి మానవతా విలువలకు గౌరవం చాటారు. తన ఉదారత తో యువతను రక్తదానానికి ప్రోత్సహిస్తూ మంచి సందేశం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అభివృద్ధి బాటలో ముందున్నారని. ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివి అన్ని ప్రజల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా అభివృద్ధికి కృషి చేస్తున్నారని.2029లో జీడీ నెల్లూరు మళ్ళీ తెలుగు దేశం జెండా ఊపుతారని ఆయన విజయాన్ని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *