మన న్యూస్ బంగారుపాళ్యం జూన్-2

చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం వెలుతురు చేను పంచాయతీ పులిమడుగు గ్రామానికి చెందిన ఎం వినాయక వయసు 35 సంవత్సరాలు తండ్రి( లేట్) బాలకృష్ణ ఇతను మామూలుగా అడవి పందులను వేటాడుతుంటాడు. ఫారెస్ట్ లోనికి వెళ్లి అడవి జంతువులను వేటాడే అలవాటులో భాగంగా, తమిళనాడు గుడియాత్తం దగ్గర గతంలో పందులను వేటాడే క్రమంలో అక్కడ పడి ఉన్న నాటు బాంబును తీసుకొచ్చి ఇంటి బయట ప్రాంతంలో మల్లె చెట్టు దగ్గర పెట్టగా, సోమవారం ఉదయం కుక్క ఆ బాంబు దగ్గరికి రాగా దానిని తరిమే సమయంలో వినాయకం అక్కడికి వెళ్ళగా ఆ బాంబు పేలడంతో కాలుకు బలమైన గాయాలు తగిలి నుజ్జునుజ్జు అయిపోవడం జరిగింది. ఈ సమాచారాన్ని వెలుతురుచేను పంచాయతీ విఆర్ఓ హేమచంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *