కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చే జీవనజ్యోతి జూనియర్ కాలేజ్ శుభారంభం.

*విద్యాలయాలు జ్ఞానం పంచే సరస్వతి నిలయాలు కావాలి……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మన న్యూస్ , కొడవలూరు:విద్యను వ్యాపారంగా కాక, ఒక సేవగా చూడాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కొడవలూరు మండలం నార్త్ రాజుపాళెం సమీపంలో సోమవారం జీవన జ్యోతి జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని జ్జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….. కోవూరు నియోజకవర్గ పరిధిలోని రాజుపాళెంలో జీవన జ్యోతి జూనియర్ కళాశాల ప్రారంభం కావడం ఈ ప్రాంత విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా వుంటుందన్నారు. విద్య అనేది మనిషి జీవితాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధమన్నారు. ఈ జూనియర్ కళాశాల ద్వారా నార్త్ రాజుపాళెం పరిసర ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యా సౌకర్యాలు అందుబాటులోనికి రానున్నాయి. విద్యార్థులను పాఠ్య పుస్తకాలకే పరిమితం చేసి చదువుకునే యంత్రాల్లా కాకుండా క్రీడా నైపుణ్యాలలో శిక్షణ యిచ్చి వారి ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీవన జ్యోతి జూనియర్ కళాశాల సిబ్బందితో పాటు టిడిపి నాయకులు బెజవాడ వంశీ కృష్ణారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాలేజ్ చైర్మన్ అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ…. ఈరోజు జీవన్ జ్యోతి కాలేజీను ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ,కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మా కాలేజీ ప్రారంభోత్సవానికి రావడం చాలా ఆనందంగా ఉంది అని చైర్మన్ తెలియజేశారు .మాకు రాయలసీమలో 20 స్కూల్స్ దాకా ఉన్నాయి, ఫస్ట్ టైం జూనియర్ కాలేజీను నెల్లూరు జిల్లాలో ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని తెలియజేశారు . మా కాలేజ్ సుశిలమైన ప్రాంగణంలో మంచి ఫ్యాకల్టీ, మంచి ప్లే గ్రౌండ్ అన్ని సౌకర్యాలతో ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నాం అని తెలియజేశారు. ఆ కాలేజీలో ఎంసెట్ ,జెఇఇ( మెయిన్)జెఇఇ (అడ్వాన్స్ ) ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ , మంచి భోజనం సదుపాయాలు, బస్సు సౌకర్యంతో విద్యార్థులకు మంచి విద్యను అందించుటకు కృషి చేస్తున్నాము అని తెలియజేశారు.మాకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు అని తెలిపారు, వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని అన్నారు. కావున నెల్లూరు జిల్లా ప్రజలు మా కాలేజీ కు సహకరించవలసిందిగా కోరుచున్నాము అని తెలియజేశారు.కాలేజ్ ప్రిన్సిపల్ అనిల్ కుమార్ మాట్లాడుతూ…… నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ,నార్త్ రాజుపాలెం వద్ద జీవనజ్యోతి జూనియర్ కాలేజ్ ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభిస్తున్నందుకు చాల సంతోషంగా ఉంది అన్నారు . ఆమె ప్రారంభానికి రావడం మాకు కొండంత ధైర్యాన్ని వచ్చింది అని అన్నారు .మా కాలేజ్ లో ఐఐటి ,నీట్ క్యాంపస్ ను పాన్ ఇండియా లెవెల్ రాజస్థాన్, విజయవాడ, బెంగళూరు వంటి నగరాలలో అనుభవం కలిగిన మంచి ఫ్యాకల్టీతో ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు . మా కాలేజ్ నెల్లూరు జిల్లాలో మాదే ఫుల్ హెచ్డి కాలేజ్ అవుతుందని తెలియజేశారు.మా కాలేజ్ లో డే స్కాలర్స్, రెసిడెన్షియల్ ,సెమి రెసిడెన్షియల్ విద్యార్థులు ఉంటారు . విద్య తో పాటు మంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు అందిస్తున్నాము. విద్యార్థి విద్యార్థులకు వేరువేరు హాస్టల్ మరియు బసౌకర్యం కలదు అని అన్నారు నెల్లూరు జిల్లా ప్రజలు కాలేజ్ ను సహకరించవలసిందిగా కోరుచున్నాము అని తెలిపారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి