మన న్యూస్ ఐరాల జూన్-2

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో తేలికపాటి వర్షాలకు ఎమ్మార్వో ఆఫీస్ పక్కన రోడ్డుపై నిరు ఉధృతంగా ప్రవహించడం, పలువురి ప్రాణాలను బలిగొనడం, రోజుల పాటు ప్రజలకు రవాణా సౌకర్యానికి అంతరాయం కలిగించడం, విద్యార్థులు, పని కోసం పట్టణానికి వెళ్లే ప్రజలు, ప్రభుత్వ అధికారులకు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యను ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్టించుకోకపోవడం బాధాకరం. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైనా ఈ సమస్యకు పరిష్కారం కలగాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ నరిగన్నగారి మరియు మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి తులసి బాబు జనసేన పార్టీ నిర్వహించే జనవాణి కార్యక్రమంలో సమస్య తీవ్రతను తెలియజేసి పరిష్కారం అందించాలని, ప్రజలకు విద్యార్థులకు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వంతెన నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఫిర్యాదు చేశారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార బృందం ప్రభుత్వం ద్వారా వంతెన నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటాం అని తిలియజేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రతి సమస్య జనసేన పార్టీ జనవాణి దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు సుపరిపాలన అందించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పూతలపట్టు మండల అధ్యక్షులు బండారు మనోహర్, బంగారుపాలెం మండలం అధ్యక్షులు గంగసాని బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *