చౌక దుకాణమును ప్రారంభించిన మండల రెవెన్యూ అధికారులు, మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు, మధు

వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని గొడుగుచింత లోని షాప్ నెంబర్ 4 ను నిత్యవసర సరుకులు చౌక దుకాణంను మండల రెవెన్యూ అధికారులతో కలిసి డీలర్ కే ఝాన్సీ, స్థానిక టిడిపి నేత, మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు మరియు మధు, జనసేన నాయకుడు నక్కా ముని చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ ల ఆలోచనతోనే అన్ని వర్గాల ప్రజలకు నిత్యవసర సరుకులు తీసుకునే వెలుసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. ప్రతినెల ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం8 గంటల నుండి మధ్యాహ్నం12 గంటల వరకు అలాగే సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. పైన తెలిపినటువంటి సమయంలో డీలర్ కే.ఝాన్సీ అందుబాటులో ఉండి పంచాయతీలోని రేషన్ కార్డుదారులందరికీ బియ్యం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కావున పంచాయతీలోని రేషన్ కార్డు కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా మధు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు ఇస్తామని ముసుగులో నిత్యవసర సరుకులు పక్కదారి పట్టాయి అన్నారు. అలా జరగకూడదని అర్హుతులైన రేషన్ కార్డుదారులందరికీ నిత్యవసర సరుకులు అందేలా కొత్త విధానాన్ని ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి ప్రవేశపెట్టారు అన్నారు. అలాగే ఎవరికైనా నిత్యవసర సరుకులు వద్దు అనుకున్న వారికి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్ ఐ, వీఆర్వో నరసింహారెడ్డి, వీఆర్ఏ రామ్మూర్తి, టిడిపి నాయకులు భాస్కర్ నాయుడు, మధు, దాము, జనసేన నాయకుడు నక్క ముని, గ్రామస్తుల తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 6 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు