మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-1

తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి గంగారపు గోపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగారపు గోపి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటును పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. ఆదివారం పూతలపట్టు మండలం, ఎస్.వి.సెట్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా మైదానంలో ఎమ్మెల్యే టాస్ వేసి మొదటి మ్యాచ్ ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని, కాసేపు బ్యాటింగ్ చేసి నిర్వహుకులను ఉత్సాహ పరిచారు. క్రీడల వల్ల స్నేహసంబంధాలు పెరిగి ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయిన వారు నిరుత్సాహ పడకుండా మళ్లీ గెలిచేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఎన్టియూసీ కార్యదర్శి యువరాజుల నాయుడు, చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి గంగారపు గోపి, పూతలపట్టు మండల టిడిపి అధ్యక్షులు దొరబాబు చౌదరి, తవణంపల్లె మండల క్లస్టర్ ఇంఛార్జ్ మోహన్ నాయుడు మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *