మన న్యూస్, నారాయణ పేట:– జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, రెవెన్యూ అధికారులు కొన్ని గ్రామాలను సందర్శించి ప్రతి నెల చివరి రోజు పౌర హక్కుల దినోత్సవం (సివిల్ రైడ్స్ డే)నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ సంధర్బంగా పోలీస్ మరియు రెవిన్యూ అధికారులు మాట్లాడుతూ,కొన్ని సంవత్సరముల క్రితం కుల వివక్ష ఉండేది అని ప్రస్తుతం అంతగా లేనప్పటికీ అక్కడక్కడ గ్రామాలలో ఉన్న అసమానతలను అంటరానితనాన్ని,కుల వివక్షను నిర్ములించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని దానికి కృషి చేయాలని అన్నారు. కుల నిర్ములనకు, ఎస్సీ ఎస్టీ కులాల వారిని చైతన్య పరుచుటకు, వారిని అభివృద్ధి వైపు నడిపించుటకు పోలీస్, రెవెన్యూ శాఖల అధికారుల సమన్వయంతో పౌరహక్కుల రక్షణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అన్ని కులాలకు చెందిన వారిని వారితో సమావేశం నిర్వహించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్టం 1989 ఈ చట్టం యొక్క విశిష్టత , వినియోగించే విదానం ల గురించి,పోక్సో చట్టం,పౌర హక్కుల రక్షణ చట్టం మొదలగు చట్టాలను అమలు చేయు విధానం గురించి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావడం కుల వివక్ష నిర్ములనపై అవగాహన కల్పించడం వల్ల అందరికి అవగాహన చైతన్యం ఉంటుందని అన్నారు. పౌర హక్కుల దినం నిర్వహించడం గ్రామాల్లో ఇంకా కుల వివక్ష అంటరానితనము దళితుల భూవివాదాలు మహిళలపై అత్యాచారాలు నిరోధించడం జరుగుతుందన్నారు.కులం పేరుతో ఎవరినైనా దూషిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, అంటరానితనం నేరమన్నారు. కులమతాల్లో తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఐకమత్యoగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ అధికారులు గ్రామ పెద్దలు, ప్రజలు మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *