మన న్యూస్, నారాయణ పేట:- మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాల్కోట చౌరస్తా వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను మరికల్ ఎస్సై తనిఖీ నిర్వహించి అనంతరం మరికల్ పోలీసులతో కలిసి ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మరికల్ ఎస్సై రాము మాట్లాడుతూ, రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా పరిధిలోని అంతర్ జిల్లా చెక్పోస్టు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలని, వాహనాల నెంబర్లను రిజిస్టర్లు నమోదు చేయాలని తెలిపారు. చెక్పోస్ట్ వద్ద అప్రమత్తంగా ఉంటూ పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. గోవులను అక్రమంగా తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ఎవరైనా పశువులను తరలిస్తే వాటికి సంబంధించిన పత్రాలను కలిగి ఉండాలని లేనియెడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *