ఆధార్ కేంద్రం, ఆర్టీసీ బస్సు సర్వీసు, వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులతో మారిన గొడుగుచింత రూపురేఖలు

గొడుగు – చింత లేని గ్రామం..

“సొంత గ్రామంలో అభివృద్ధి వర్షం కురిపిస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్..”

“ఎమ్మెల్యే చొరవతో ఆధార్ కేంద్రం‌ ఏర్పాటు..”

“అందుబాటులో ప్రభుత్వ సేవలు, అభివృద్ధి వైపు అడుగులు..”

మన న్యూస్ పూతలపట్టు మండలం మే-9:- పూతలపట్టు మండలం, గొడుగుచింత గ్రామం ఇప్పుడు “నిజంగా గొడుగు – చింత లేని గ్రామంగా” మారుతుంది. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావడం, అభివృద్ధి వైపు అడుగులు వేయడం వంటి కార్యక్రమాలు చకచక జరుగుతున్నాయి. అందులో “పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్” స్వగ్రామం కావడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధతో అనేక మౌలిక సదుపాయాలు ప్రజల కోసం సమకూర్చుతున్నారు. గ్రామస్థులు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజల అవసరాలను గమనించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ మంజూరులతో పాటు తన వ్యక్తిగత శ్రద్ధతో చేపట్టిన అభివృద్ధి పనులు గ్రామానికి ఒక కొత్త రూపాన్ని తెచ్చి పెడుతుంది. “ముఖ్యంగా ఆధార్ సేవల కోసం ఎదురైన ఇబ్బందులు పరిష్కరించేందుకు గొడుగుచింత గ్రామంలో ఆధార్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు”. గతంలో ఆధార్ సేవల కోసం ప్రజలు దూరంగా ఉండే పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీనివల్ల ప్రయాణ ఖర్చులు, సమయం మరియు శ్రమ భరించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో గొడుగుచింతలో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, కేవలం స్థానికులకే కాదు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఆధార్ అప్డేట్, చిరునామా మార్పులు వంటి సేవలు సులభంగా అందుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభించి గ్రామాన్ని చిత్తూరు పట్టణంతో నేరుగా అనుసంధానించారు. ఇది విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలు మరియు రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. సీసీ రోడ్లు, స్మశానానికి ప్రత్యేక రహదారి, మరియు వాటర్ ప్లాంట్ ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు గ్రామ రూపురేఖను పూర్తిగా మార్చేశారు. గొడుగుచింత గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్ సేవలను గ్రామస్థులు మాత్రమే కాకుండా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి