

మన న్యూస్ (బంగారుపాళ్యం మండలం) మే-9:- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు నియామకంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బంగారు పాల్యం మండల బూత్ కమిటీ అధ్యక్షుడిగా జె.కొత్తూరు భాను ప్రకాష్ రెడ్డిని నియమించినందుకు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ ని పలమనేరులో ఆయన నివాసంలో కలిసి పూలమాలవేసి శాలువా కప్పి స్వీట్స్ అందజేసి ధన్యవాదాలు తెలియజేశారు. తాను పార్టీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ, ఎప్పుడు పదవి ఆశించకపోయిన తాను పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఈరోజు మండల బూత్ కమిటీ అధ్యక్షులుగా ప్రకటించడం పై ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పటికీ పార్టీకి రుణపడి ఉంటానని,మండలంలోని 41 పంచాయతీలలో తిరిగి వైయస్సార్సీపి పార్టీని రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేస్తానని డాక్టర్ సునీల్ కుమార్ ముందు తెలియజేశారు. 2029 వ సంవత్సరం నాటికి రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలన్నది తన లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి , మాజీ మంత్రివర్యులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి , ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డీ, పూతలపట్టు నియోజక వర్గం మాజీ శాసనసభ్యులు సమన్వయకర్త డాక్టర్ ఎం. సునిల్ కుమార్, బంగారుపాలెం మండల కన్వీనర్ పాలేరు రామచంద్రా రెడ్డి , మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు, రాష్ట్ర పాలయకరి సంఘ అధ్యక్షులు ఎంబి కుమార్ రాజా, మండల వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి , ప్రవీణ్ రెడ్డి, శరత్ రెడ్డి,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డిలకు, మండల వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు, జిల్లేడుపల్లి పంచాయతీ లోని నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.