

మన న్యూస్,తిరుపతి, : తిరుపతి జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిగా కే వెంకటరావు గురువారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రకాశం జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. తిరుమల డిపో తనిఖీ చేసిన డి పి టి ఓ : జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి తిరుమల డిపోను తనిఖీ చేశారు. భక్తులతో స్నేహపూర్వకంగా మెలగాలని, మనము భక్తులకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మికులకు డి పి టి ఓ సూచించారు. అనంతరం జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి కార్యాలయంలోని పలు సెక్షన్లకు చెందిన అధికారులు సిబ్బంది ఆయనను మర్యాదపూర్వక కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం పలు ఉద్యోగ సంఘాల నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.