

మన న్యూస్ ,నెల్లూరు, మే 2:– షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయిన నెల్లూరు కోటమిట్ట 42 డివిజన్ కు చెందిన సర్తాజ్ కుటుంబానికి వైఎస్ఆర్సిపి మైనార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం నెల్లూరు రాంజీ నగర్ ఆఫీస్ లో బాధిత కుటుంబానికి నగదును అందజేశారు.బాధిత కుటుంబానికి మరి కొంత నగదును అందజేసేందుకు ముందుకు వచ్చిన 42 వ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లాని కూడా చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.సర్తజ్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నెల్లూరు సిటీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజుసర్తాజ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన సర్తజ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్, వైసిపి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్దిక్,42వ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లా, 42 వ డివిజన్ నాయకులు అబ్దుల్ మస్తాన్, అలీం, జహీద్ తదితరులు పాల్గొన్నారు.
