

నర్వ మండలం మన న్యూస్:- నర్వ మండలం సీపూర్ గ్రామం లో అంగన్వాడీ సెంటర్ లో శుక్రవారం యోగ పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోగ గురువు నౌసు నరసింహులు చేతుల మీదుగా అంగన్వాడీ పిల్లల తల్లీ లకు అన్న ప్రసనం చేశారు. బొట్టు పెట్టి తలకు పూలు గంధంపెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం ప్రతి నెలలో 4వ శక్రవారం 7 నెలల నుండి సంవత్సరం వయసున్న విద్యార్ధి తల్లులకు మాత్రమే నిర్వహిస్తామని అంగన్వాడి టీచర్ గాయత్రి దేవి తెలిపారు.యోగ గురించి కొన్ని సూచనలు సలహాలు పిల్లల తల్లులకు ఆరోగ్యంగా ఉండాలంటే యోగ చేయాలనీ కొన్ని ఆసనాలు చూయించడము జరిగింది,ప్రణయం మందుకాశనం అనులోమ్ విలోమ్ కాపలాబాతి బయప్రణయం ఆసనాలు చేసి ఆరోగ్యాన్ని కాపాడాలని మహిళలకు చూయించడం సూచించారు.అంగన్వాడీ టీచర్ గాయిత్రి దేవి మాట్లాడుతూ.. నెలలో మొదటి శుక్రవారం ANMఆశ వర్కర్ లతో వ్యాధి నిరోధక 4వ శనివారం 2 సంవత్సరాలు పిల్లల తల్లులకీ అక్షర బ్యాసం 1వ శనివారం గర్భినులకీ శ్రీ మంతం లాంటి కార్యక్రములు నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో శిరీష పోలమ్మ లక్ష్మమ్మ నర్సింగమ్మ అంబికా రేణుక తదితరులు పాల్గొన్నారు.
