

మన న్యూస్,నిజాంసాగర్,కొనుగోలు కేంద్రాలలో లారీల కొరత లేకుండా చూస్తామని డిఆర్డిఓ పిడి సురేందర్ అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గేటు వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యాన్ని అయిన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తూకం ప్రారంభించకపోవడంతో ఆయన ఐకెపి ఎపిఎం పై అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజులల్లో తూకం ప్రారంభించాలని ఆయన సూచించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసే విధంగా ప్రతి ఒక్కరు సమన్యంతో పని చేయాలన్నారు.ఆయన వెంట డిపిఎం రమేష్ బాబు ,సుధాకర్,ఐకెపి ఎపిఎం రామ్ నారాయణ గౌడ్,ఐకెపి సీసీ రాములు తదితరులు ఉన్నారు.