

మన న్యూస్, కోవూరు, ఏప్రిల్ 22:- భక్తుల రామనామ స్మరణతో ఆలయ పరిసరాలను ప్రతిధ్వనించాయి. భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.
ఇందుకూరుపేట మండలం రాముడు పాళెం గ్రామ పరిధిలోని ఎర్రంకి దిబ్బ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే ని ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకొని తీర్ధ. ప్రసాదాలు స్వీకరించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవాన్ని భక్తులతో కలిసి తిలకించారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో టిడిపి నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, చెంచు కిషోర్ యాదవ్ లతో పాటు స్థానిక టిడిపి నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
