

మన న్యూస్ సాలూరు ఏప్రిల్ 21:= పంట వ్యర్ధాలను తగులు పెట్టకుండా రోటవేటర్ సహాయంతో నేలలో కలుపుకున్నట్లయితే సేంద్రియ కర్బన శాతం పెరుగుతుందని తగుల పెట్టడం వలన భూమి వేడెక్కి మట్టి కణాలు నశించిపోతాయని వాతావరణం కాలుష్యం పెరుగుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు.సరైయవలస రెట్లపాడు గ్రామాలలో పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు మొక్కజొన్న వ్యర్ధాలను పొలాల్లో కాలుస్తున్నారని మొక్కజొన్న కాడ మరియు పొట్టు లో అనేక పోషక నిల్వలు ఉంటాయని వీటిని భూమిలో కలుపుకోవాలి కానీ కాల్చకూడదని సూచించారు. పశువుల గెత్తము ను సరియైన పద్ధతిలో నేలలో కలపాలి,రైతులు పశువుల పెంట తీసుకువెళ్లి పొలాలలో కుప్పలుగా పోసి అనేక రోజులు నేలలో కలపకుండా విడిచి పెడుతున్నారని దీనివలన పశువుల పెంటగా ఉన్న పోషకాలు చాలావరకు ఎండ వేడిమి కి నశించిపోతాయని కాబట్టి పశువుల పెంటను పొలానికి తోలిన వెంటనే నేలలో కలిగి ఉండాలని కోరారు పశువుల పెంట కలిగి ఉండడం ద్వారా పంట వ్యర్ధాలను నేలలో కలపడం ద్వారా భూమి లోపలి వాతావరణం మెరుగుపడుతుందని రసాయన ఎరువుల మీద ఆధారపడడం తగ్గడమే కాకుండా వేసిన రసాయన ఎరువులు కూడా పంటకు బాగా అందుతుందని దీనివల్ల దిగబడలు బాగా పెరుగుతాయి అని తెలిపారు అనంతరం నవధాన్య విత్తనాలను రైతులతో చెల్లించారు చిరు సంచులలో ఉన్న మినుము రకం విబిఎన్ 8 రకాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎల్ వన్ సిఆర్పి సూర్యారావు గ్రామ వ్యవసాయ సహాయకులు సాయి గణేష్ ఐసిఆర్పి సుకరమ్మ రైతులు పాల్గొన్నారు.
