

మనన్యూస్,ఏలేశ్వరం:దుర్గా శ్రీనివాస్ ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా పాస్టర్ జె.రాజు మాట్లాడుతూ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని,ప్రభుత్వం ప్రవీణ్ మృతి పట్ల నిజాలను నిగ్గు తేల్చాలని, మతోన్మాదులు ఆయన మృతిని పలు రకాలుగా సృష్టించి సామాజిక మాధ్యమాలలో వ్యంగ్యంగా మాట్లాడుకున్నారని వాటిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ కాదు అని హత్యానని పలు అనుమానాలు దారితీస్తున్నాయి. ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని సంఘ సభ్యులందరూ కలిసి ప్రార్థన చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సెయింట్ పాల్స్ లూధరన్ చర్చ్ చైర్మన్ గుడాల దైవ సహాయం,డెల్గెట్ కొండ్రు ప్రభాకర్ రావు, ఆల్టర్నేట్ డెల్గేట్ కొండ్రు రత్నరాజు,ట్రెజరర్ గొడుగు నాగభూషణం,సంఘ సభ్యులు,జై భీమ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
