నెల్లూరు జిల్లా,పొదలకూరులో విద్యుత్ శాఖ కార్యాలయం ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మనన్యూస్,సర్వేపల్లి:విద్యుత్ లేనిదే ప్రపంచం లేదు…పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత మనదే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకోండి.
టీడీపీ కూటమి పాలనలో ఆక్వా రైతులకు మళ్లీ మంచి రోజులు…జోన్, నాన్ జోన్ నిబంధనలు లేకుండా రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇస్తుంది అని అన్నారు.వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దోపిడీలతో విద్యుత్ రంగంపై పెనుభారం పడింది అని పొదలకూరులో విద్యుత్ శాఖ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
విరువూరు, మహ్మదాపురం పంచాయతీలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన చెత్త తరలింపు ట్రాక్టర్ల అప్ప గిస్తాము అని అన్నారు.
ప్రస్తుత రోజుల్లో బతకడానికి ఆహారం ఎంత అవసరమో కరెంటు కూడా అంతే,కరెంట్ లేకపోతే ప్రపంచం ముందుకు నడవని పరిస్థితి అని అన్నారు.
గత ఐదేళ్లలో విద్యుత్ శాఖ మీద వివిధ రూపాల్లో భారీగా భారం పెంచేశారు అని తెలిపారు.
ట్రాన్స్ పార్మర్లు, స్మార్ట్ మీటర్లు, తీగలు, కండక్టర్లు తదితర అన్ని పరికరాల కొనుగోలులోనూ దోపిడీ,చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించడం శుభపరిణామం అని తెలిపారు.
2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో జోన్, నాన్ జోన్ అనే తేడా లేకుండా ఆక్వా రంగానికి రూ.2కే యూనిట్ విద్యుత్ అందించారు అని తెలియజేశారు.
మీ బిడ్డ మీబిడ్డ అని చెప్పుకునే జగనన్న రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇస్తానని జోన్, నాన్ జోన్ పేరిట గందరగోళానికి తెరలేపారు అని తెలియజేశారు.
జోన్ పరిధిలోకి వైసీపీ నాయకులు,సానుభూతిపరులను మాత్రమే తెచ్చారు. నాన్ జోన్ పరిధిలో రూ.5కి పైగా భారం మోపారు అని తెలిపారు.
ఉదాహరణకు కృష్ణపట్నంలో ఉప్పు కాలువ, సముద్రం మధ్య ఆక్వా సాగు చేసే రైతులకు గత టీడీపీ ప్రబుత్వ హయాంలో యుద్దప్రాతిపదికన విద్యుత్ సౌకర్యం కల్పించాం అని తెలిపారు.టీడీపీ ప్రభుత్వం మారగానే ఏడుగురు వైసీపీ సానుభూతి పరులను మాత్రమే జోన్ పరిధిలోకి తెచ్చారు.మిగిలిన రైతులందరిపై నాన్ జోన్ పేరుతో పెనుభారం మోపారు అని అన్నారు.ఇకపై ఆక్వా రైతులందరికీ జోన్, నాన్ జోన్, చిన్నరైతు, పెద్దరైతు అనే తేడా లేకుండా రూ.1.50కే విద్యుత్ ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు అని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించాలి..అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకుని సోలార్ యూనిట్లు పెట్టించుకోవాలి అని అన్నారు.
నీటితో పాటు కరెంటును పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని తెలియజేశారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..