విప్రో జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ స్వస్తి మిగతా మార్గాల్లోనూ డౌటే

Mana News, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లలో విప్రో జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్, విప్రో జంక్షన్‌ల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణాల అంచనా వ్యయం రూ.837 కోట్లుగా చెప్పి..నాలుగో ప్యాకేజీలో భాగంగా ఈ మూడింటికీ కలిపి టెండర్లు పిలవాల్సి ఉంది. కానీ విప్రో జంక్షన్‌ వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి మాత్రం టెండర్లు పిలవకుండా పెండింగ్‌లో ఉంచి మిగతా రెండు జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వాటి నిర్మాణ అంచనా వ్యయం రూ.650 కోట్లు. విప్రో జంక్షన్‌ వద్ద టెండరు పిలవకపోవడానికి కారణం ఆ మార్గంలో మెట్రో రైలు మార్గం కూడా రానున్నందున ఒకే పిల్లర్‌పై మెట్రో మార్గం, జీహెచ్‌ఎంసీ ఫ్లై ఓవర్‌ను డబుల్‌ డెక్కర్‌గా నిర్మించాలని భావించారు. ఆ మేరకు జరిగిన జీహెచ్‌ఎంసీ, రైల్వే అధికారుల సమావేశంలో డబుల్‌ డెక్కర్‌ నిర్మాణానికి రైల్వే నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. దాంతోపాటు మెట్రో మార్గం నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు, తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని రైల్వేతో సమన్వయం కుదరదని జీహెచ్‌ఎంసీ కూడా భావించింది. అంతే కాకుండా జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ జామ్‌లు లేకుండా సిగ్నల్‌ ఫ్రీగా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ ఫ్లై ఓవర్లను నిర్మిస్తోంది. మెట్రో రైలు స్టేషన్‌ జంక్షన్‌లోనే ఉంటుంది. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకొని ఆ ఫ్లై ఓవర్‌కు టెండర్‌ పిలవలేదు. అది మా జాగా.. మేమే నిర్మిస్తాం :- మరోవైపు, విప్రో జంక్షన్‌ స్థలం తెలంగాణ ఇండ్రస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌కు చెందినది కావడంతో తమ స్థలంలో అవసరమైన ఫ్లై ఓవర్‌ను తామే నిర్మిస్తాం సదరు కార్పొరేషన్‌ అధికారులు జీహెచ్‌ఎంసీకి తెలిపినట్లు సమాచారం. దీంతో ఇక విప్రో జంక్షన్‌లో ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ విరమించుకుంది. మిగతా మార్గాల్లో డౌటే :- ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లోనూ డబుల్‌ డెక్కర్ల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జీహెచ్‌ఎంసీ కొత్తగా నిర్మించబోయే ఫ్లై ఓవర్ల మార్గాల్లో మెట్రో రైలు మార్గాలున్నట్లయితే ఫ్లై ఓవర్ల పై వరుసలో మెట్రో రైలు మార్గానికి అనుగుణంగా పిల్లర్లు నిరి్మంచాలని భావించారు. ఎత్తయిన పిల్లర్లు నిర్మించి డబుల్‌ డెక్కర్‌గా రెండు నిర్మాణాలు చేయాలనుకున్నారు. అందులో భాగంగానే విప్రో జంక్షన్‌ వద్ద కూడా సిద్ధమైనప్పటికీ, ప్రభుత్వశాఖలు వేటికవిగా అందుకు విభేదించడంతో జీహెచ్‌ఎంసీ విరమించుకుంది. మియాపూర్‌ -పటాన్‌న్‌చెరు మార్గంలో ఆలి్వ¯Œన్‌ క్రాస్‌రోడ్, మదీనగూడ, చందానగర్, బీహెచ్‌ఈఎల్,ఇక్రిశాట్‌ల మార్గాల్లో, నాగోల్‌- ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో ఎల్‌బీనగర్, కర్మ¯న్‌Œ ఘాట్, ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్‌ తదితర ప్రాంతాల్లో మెట్రో రైలు రానుంది. ఆ మార్గాల్లో జీహెచ్‌ఎంసీ ఫ్లై ఓవర్లు వచ్చేచోట డబుల్‌డెక్కర్లుగా డబుల్‌ డెక్కర్లు నిరి్మంచేందుకు ఆలోచనలు చేసినప్పటికీ, తాజా పరిస్థితులతో డైలమాలో పడ్డాయి.

⇒ నాగోల్‌- ఎయిర్‌పోర్టు మార్గంలో మెట్రో మార్గంలో జీహెచ్‌ఎంసీ ఫ్లై ఓవర్లు వచ్చే ప్రాంతాలు
⇒ టీకేఆర్‌ కాలేజ్,గాయత్రినగర్, మందమల్లమ్మ జంక్షన్లు
⇒ ఒమర్‌ హోటల్‌- సోయబ్‌హోటల్‌ (వయా మెట్రో ఫంక్షన్‌హాల్‌)
⇒ బండ్లగూడ- ఎరక్రుంట క్రాస్‌రోడ్స్‌
⇒ మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్‌ రోడ్, కాటేదాన్‌ జంక్షన్‌.
⇒ మియాపూర్‌ క్రాస్‌రోడ్‌- ఆలి్వన్‌ క్రాస్‌రోడ్‌ మార్గంలో మదీనగూడ గంగారం వద్ద.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///