Mana News ;- జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. భవిష్యత్ ముఖచిత్రం ఏంటో..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి- భవిష్యత్ ముఖచిత్రం ఎలా ఉండబోతోందనే విషయంపై చర్చకు దారి తీసింది. కూటమి భాగస్వామి బీజేపీలో సైతం చర్చనీయాంశమౌతోంది. అధికారంలోకి వచ్చాక.. అధికారంలోకి వచ్చిన తరువాత జనసేన నిర్వహించిన మొట్టమొదటి సభ ఇదే. ఆ రకంగా చూస్తే- జనసేనకు ఇది తొలి ఏడాది. ఫలితంగా- ఇందులో ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడతారనేది ఉత్కంఠత రేపింది. దానికి అనుగుణంగానే పవన్ కల్యాణ్, కాబోయే ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రుల ప్రసంగాలు ఉన్నాయని అంటున్నారు. నాగబాబు వ్యాఖ్యలతో.. ప్రత్యేకించి- ఈ సభలో నాగబాబు చేసిన ప్రసంగం సంచలనాలకు తెర తీసింది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి దోహదపడింది పూర్తిగా జనసేన నాయకులు, కార్యకర్తలేనని తేల్చి చెప్పడం, తామే గెలిపించామనుకుంటే అది వారి ఖర్మేనంటూ చురకలు అంటించడం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. వర్మను ఉద్దేశించే? :- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మను ఉద్దేశించే నాగబాబు పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది బహిరంగ రహస్యమే. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు వర్మ. పొత్తులో భాగంగా పిఠాపురాన్ని వదలుకున్నారు. తొలి జాబితాలోనే ఆయనను శాసన మండలికి పంపిస్తానంటూ చంద్రబాబు సైతం అప్పట్లో హామీ ఇచ్చారు. నాగబాబుతో చెక్..టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు చోటు దక్కలేదు. ఆయన స్థానాన్ని నాగబాబు ఆక్రమించుకున్నారనే అభిప్రాయం ఇప్పటికే జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. దానికి అనుగుణంగా అదే నాగబాబు ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభ వేదికగా పరోక్షంగా వర్మను ఉద్దేశించి తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండూ పోయినట్టేనా? :- సాక్షాత్తూ చంద్రబాబే హామీ ఇచ్చినా కూడా శాసన మండలికి వర్మ ఎంపిక కాలేకపోయారనే అసహనం ఇప్పటికే వర్మ క్యాడర్‌లో వ్యక్తమౌతోంది. దీనికి తగ్గట్టుగా ఇప్పుడు నాగబాబు ఈ అసహనంపై మరింత ఆజ్యం పోశారని అంటున్నారు. ఎమ్మెల్సీ, పిఠాపురం స్థానాన్ని వర్మ దాదాపుగా కోల్పోయినట్టేనని చెబుతున్నారు. వర్మ అడుగులు ఎటు..జనసేన ఆవిర్భావ సభ తరువాత వర్మకు పిఠాపురంలో చోటు ఉండకపోవచ్చనే అంటున్నారు. ఫలితంగా ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అనుచరుల్లో నెలకొన్న ఈ అసహనాన్ని, అసమ్మతిని తెలుగుదేశం అధి నాయకత్వం ఎలా చల్లారుస్తుంది? నాగబాబు వ్యాఖ్యలు చేసిన డ్యామేజీని ఎలా దిద్దుతుంది?, లేదా దీన్ని తేలిగ్గా తీసుకుంటుందా?.. అనేది వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *