

మన న్యూస్, జీడి నెల్లూరు :- పత్రికల్లో యూట్యూబ్ ఛానల్ లో ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి యం థామస్ పై వారి వ్యక్తిగత సహాయకుల పై వస్తున్న అవాస్తవ కథనాలపై ఘాటుగా స్పందించిన ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి యం థామస్. నిత్యం నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం పై కృషి చేస్తున్న ఎమ్మెల్యే నామీద మరియు నా వ్యక్తిగత సహాయకులు పైన నిరాదారిత ఆరోపణలు చేయడం తగదని, ఇలాంటి నీచ రాజకీయాలు ఆరోపణలు చేస్తున్న నియోజకవర్గంలోని కొంత మంది పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగత నిరాధారిత ఆరోపణలు చేస్తే “డిఫర్మేషన్” కేసు నమోదు చేయాల్సివస్తుందిని అన్నారు.
