వరికుంటపాడు, అక్టోబర్ 1 (మన న్యూస్):
వరికుంటపాడు మండలంలోని తూర్పు రొంపిదొడ్ల గ్రామ పంచాయతీలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తూర్పు రొంపిదొడ్లలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ మార్నేని రామకృష్ణ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, అందులో భాగంగానే ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దకే వెళ్లి నగదు అందజేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి నాయకులు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ రాకేష్, పెన్షన్ లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *