

Mana News , కర్నూలు: వైకాపా నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళిని విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. పీటీ వారెంట్‌పై కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయన్ను ఇక్కడికి తరలించారు. కోర్టు రిమాండ్ విధిస్తే పోసానిని విజయవాడ జైలుకు తరలించే అవకాశం ఉంది. రిమాండ్ విధించని పక్షంలో మరోసారి కర్నూలు జైలుకు పంపించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు, వారి కుటుంబసభ్యులు, మీడియా సంస్థలపై దూషణలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారమై పలు పోలీసుస్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.
