Mana News :- రైల్వేశాఖలో జరుగుతున్న సంస్కరణల్లో భాగంగా పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిలో భాగంగా ఇప్పుడు తూర్పు కోస్తా రైల్వే ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశాలో రాకపోకలు సాగించే 10 రైళ్ల నంబర్లలో మార్పులు చేసింది. తాజా నంబర్ల జాబితాను విడుదల చేసింది. ఆయా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఈ మార్పులు గమనించాలని తూర్పు కోస్తా రైల్వే అధికారులు కోరుతున్నారు. తూర్పు కోస్తా రైల్వే నుంచి రాకపోకలు సాగించే 10 రైళ్ల నంబర్లలో మార్పులు జరిగాయి. అయితే వీటిలో పలు రైళ్లను మార్చి 1 నుంచే నంబర్లు మార్చగా.. మరికొన్నింటికి ఈ నెల 4,5, 7, 9వ తేదీల్లో మారుస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే తెలిపింది. ఇందులో విశాఖ-కడప రైలు నంబర్ 17488 నుంచి 18521గా మారింది. అలాగే కడప-విశాఖ రైలు నంబర్ 17487 నుంచి 18522గా మారింది. విశాఖ-గుంటూరు రైలు నంబర్ 22701ని కాస్తా 22875గా మార్చారు. అలాగే గుంటూరు-విశాఖ రైలు నంబర్ 22702ని కాస్తా 22876గా మార్చారు. ఈ నాలుగు రైళ్ల నంబర్లు మార్చి 1 నుంచే మారాయి. వీటితో పాటు భువనేశ్వర్-రామేశ్వరం వీక్లీ ఎక్స్ ప్రెస్ నంబర్ 20896 ను 20849గా ఈ నెల 7 నుంచి మారుస్తున్నారు. అలాగే రామేశ్వరం-భువనేశ్వర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ నంబర్ ను 20895 నుంచి 20850గా ఈ నెల 9 నుంచి మారుస్తున్నారు. అలాగే భువనేశ్వర్ -పుదుచ్చేరి వీక్లీ ఎక్స్ ప్రెస్ నంబర్ 12898 ని కాస్తా 20851గా ఈ నెల 4 నుంచి మార్చారు. పుదుచ్చేరి-భువనేశ్వర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ నంబర్ 12897 కాస్తా 20852గా ఈ నెల 5న మార్చారు. అలాగే భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్ ప్రెస్ నంబర్ 12830 ని ఈ నెల 6న అంటే ఇవాళ్టి నుంచి 20853గా మార్చారు. చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ 12829ని రేపటి నుంచి 20854గా మార్చారు. ప్రయాణికులు ఈ మార్పులు గమనించి టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *