ఆంధ్రప్రదేశ్‌పై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

Mana News, న్యూఢిల్లీ, మార్చి 03: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధిక నీటిని తీసుకుంటోందని ఆయన విమర్శించారు.నీటి తరలింపును అడ్డుకోవాలని తాము కేంద్రాన్ని కోరామని స్పష్టం చేశారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ.ఆర్. పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు తెలంగాణ ఎంపీలతోపాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయింపు, వినియోగంపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ఇటీవల జరిగిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్ సంఘటనను సైతం మంత్రికి వీరు సోదాహరణగా వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కార్యాలయం వెలుపల సీఎం రేవంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ చేపడుతోన్న బనకచర్లపై తమ అభ్యంతరాన్ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు తెలియజేశామన్నారు.అయితే ఏపీ నుంచి ఈ బనకచర్ల ప్రాజెక్ట్‌పై తమకు ఎలాంటి డీపీఆర్ రాలేదని మంత్రి వివరించారని చెప్పారని తెలిపారు. అలాగే పాలమూరు, రంగారెడ్డి, సమ్మక్క – సారక్క ప్రాజెక్టులకు.. త్వరగా నీటి కేటాయింపులు చేయాలని మంత్రిని కోరినట్లు ఆయన వివరించారు. ఇక తమ ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) క్లియరెన్స్ ఇంకా రాలేదని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరామని చెప్పారు. గోదావరి జలాలను అనుసంధానం చేసే అంశాన్ని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. సమ్మక్క సారక్క, సీతారామ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంత వరకు జరగలేదని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో తమ ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం చెబుతోందంటూ ఏపీపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తమ ప్రాజెక్టులకు, శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతే నికర జలాలు ఉన్నాయనేది లెక్క తేలుతుందని ఆయన వివరించారు.తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాత ఇతర ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. గోదావరి వరద జలాలను బనకచర్లకు తరలిస్తామని అంటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఇక నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌, శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకు వెళ్తున్న అధిక జలాలను ఆపాలని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను తాము కోరామన్నారు. కేంద్రం అత్యవసరంగా జోక్యం చేసుకొని ఈ అన్యాయాన్ని ఆపాలని ఆయనకు విజ్జప్తి చేశామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు.గోదావరిపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు తాము అభ్యంతరం చేప్పామని ఆయన స్పష్టం చేశారు. అయితే దీనిపై ఏపీ నుంచి ఎటువంటి నివేదిక రాలేదని.. ఈ అంశంలో తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణకు అధిక నీరు ఇచ్చేలా సహకరించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క సారక్క, సీతారామ సాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతోపాటు నిధులు సైతం ఇవ్వాలని తాము అడిగాని వివరించారు.అలాగే కృష్ణా నదిలో శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా ఇతర ప్రాజెక్టులలో టెలీ మెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. అవసరమైతే.. టెలీమెట్రీల కోసం తెలంగాణ, ఆంధ్రా వాటా ఖర్చు సైతం తామే భరిస్తామని కేంద్రానికి స్పష్టం చేశామని వివరించారు. తమ ఈ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సానుకూలంగా స్పందించారన్నారు.మరోవైపు ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు 50 ఏళ్ల పాటు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరామన్నారు. అలాగే మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (NDSA ) నుంచి త్వరగా నివేదిక అందేలా ఆదేశించాలని విజ్జప్తి చేసినట్లు తెలిపారు. అయితే తెలంగాణ జల వనరుల విషయంలో కేంద్రం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, తాను.. బలమైన వాదనలు వినిపించామని తెలిపారు.కృష్ణా జలాల వివాదంలో రోజు వారీగా కేంద్రం జోక్యం చేసుకుంటుందని హామీ ఇచ్చిందని చెప్పారు. అదే విధంగా దీర్ఘకాలికంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని కోరాన్నారు. తుమ్మడిహట్టి సమీపంలో గతంలో కాంగ్రెస్ ప్రతిపాదించి పనులు మొదలు పెట్టనున్నామన్నారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రంతో చర్చించామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భూసేకరణ విషయంలో సహకరించాలని కేంద్రాన్ని కోరినట్లు వివరించారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

  • By RAHEEM
  • September 10, 2025
  • 8 views
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 9 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ