‘ఆమెకు ఇచ్చిన టాస్క్ ఒక్కటే.. సీఎం చేంజ్ ఆపరేషన్’

Mana News, హైదరాబాద్: తెలంగాణలో నాలుగు స్తంభాలాటగా మంత్రి వర్గం నడుస్తోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ క్యాబినెట్ లో కలహాలు, కథలు కథులుగా నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ ఆగస్టు వరకూ తెలంగాణలో సీఎం మార్పు తథ్యమని మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. అందులో భాగంగానే కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చారన్నారు. ఆమెకు రాహుల్ గాంధీ అప్పగించిన టాస్క్ ఒక్కటే.. సీఎం ఛేంజ్ ఆపరేషన్ అంటూ చమత్కరించారు.’తెలంగాణ ఆడపిల్లల ఆశీర్వాదం కాదు.. ఢిల్లీ నుంచి వచ్చిన మీనాక్షి నటరాజన్ ఆశీర్వాదం ఉంటేనే రేవంత్ సీఎంగా కొనసాగుతారు. రాహుల్ గాంధీ సొంత టీం నుంచి మీనాక్షి నటరాజన్ ను ‘మిషన్ సీఎం ఛేంజ్ ఆపరేషన్’ కోసం పంపించారు. మంత్రులు.. సీఎంను లెక్క చేయడం లేదని స్వయంగా రేవంత్ పార్టీ ఇంచార్జ్ ముందుకు చెప్పుకున్నారు.* రాహుల్ గాంధీ ఇన్‌డైరెక్ట్ గా సీఎం ఛేంజ్ ఇండికేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ ను పనిచేయనివ్వడం లేదని భట్టి, ఉత్తమ్, పొంగులేటిని అనుమానిస్తున్నారు. మూటల పంచాయతీ నడుస్తోంది. ఎవరి శాఖ వాళ్లదే అన్నట్లుగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మేం ఎస్ఎల్బీసీకి వెళ్లిన తర్వాత సీఎం రేవంత్ అక్కడకు వెళ్లివచ్చారు.ప్రతీ అంశం ఢిల్లీ కి చెరవేస్తున్నది.. రేవంత్ ను ఏ పని చేయకుండా అడ్డుకుంటున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అనుకుంటున్నారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ ను తీసుకు వచ్చిన.. మాస్టర్ ప్లాన్ ఉత్తమ్ కుమార్ రెడ్డే. మిలటరీ మాస్టర్ ప్లాన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డివే. గతంలో ఇంచార్జ్ గా కుంతియాను తెచ్చుకున్నది ఉత్తమ్ కుమారే. మూడు మంత్రులు పోటీపడి అధిష్టానానికి కప్పం కడుతున్నారు. ఆ ముగ్గురు సీఎం రేవంత్ తో సంబంధం లేకుండా నేరుగా అధిష్టానంతో డీల్ చేసుకుంటున్నారు’ అని మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

Related Posts

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

నర్వ ఏప్రిల్ 24:- మన న్యూస్ :-ధరణి తో సాధ్యం కాని ఎన్నో భూ సమస్యలకు కొత్త చట్టం భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.…

పాఠశాల భవనానికి ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన

శేరిలింగంపల్లి 23ఏప్రిల్ మన న్యూస్:-  కొండాపూర్ డివిజన్  పరిధిలోని  గచ్చిబౌలి లో గల ప్రభుత్వ ప్రైమరీ  హై స్కూల్ ఆవరణలో సిఎస్ఆర్  నిధులతో  రూ. 2 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే నూతన పాఠశాల భవన నిర్మాణం పనులకు జోనల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు