

మన న్యూస్,సరూర్ నగర్: ఉత్తమ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న రమణారెడ్డి విద్య రంగంలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటించి విద్యార్థులకు నాణ్యమైన భోధన అందించిన ఆర్ ఆర్ అపోలో మెడికల్ అకాడమీ చైర్మన్ రమణ రెడ్డి ఉత్తమ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. మంగళవారం హైబిజ్ టీవీ , టివీ 5 సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా శాంత బయో టెక్ ఎండి వరప్రసాద్ రెడ్డి మల్లారెడ్డి విశ్వ విద్యా పీఠ్ వైస్ చైర్మన్ డా. సి హెచ్ ప్రీతీ రెడ్డి , భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య చేతుల మీదుగా హై టెక్ సిటీలోని నోవాటెల్ హోటల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రమణారెడ్డి అవార్డు అందుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అవార్డు రావడం పట్ల మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఇదే నూతన ఉత్సహంతో మరింత మంది పేద విద్యార్థులకు మెడికల్ లో సీట్లు సాధించే విధంగా విద్యా భోధన అందిస్తానని తెలిపారు. అతి తక్కువ ఫీజు కై నాణ్యమైన భోధన అందించడం తమ అకాడమీ ప్రత్యేకత అన్నారు. విద్యార్థిని, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో భోదిస్తామని తెలిపారు. ఈ కార్య్రక్రమంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈవి నర్సింహా రెడ్డి, సెయింట్ గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి , లైఫ్ స్పాన్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర రామ్ , మెట్రో ఇండియా, ఇంటర్ కాంటినెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ , విజయ క్రాంతి ఎండి చిల్లప్ప గిరి విజయ లు పాల్గొన్నారు.